గతకొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో “ఉప ఎన్నికలు” అనే మాట బలంగా వినిపిస్తోంది! అది రఘురామకృష్ణంరాజు వ్యవహారమే కావొచ్చు.. వల్లభనేని వంశీ సంగతే కావొచ్చు! అయితే ఈ సమయంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కచ్చితంగా దాన్ని ప్రస్తుత ప్రభుత్వ పాలనపై రెఫరెండంగానే చూస్తారు! ఈ క్రమంలో వల్లభనేని వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజినామా చేసి.. ఈసారి ఫ్యాన్ గుర్తుపై గెలవాలని భావిస్తున్నారంటూ కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో వంశీ వెనక్కి తగ్గారని అంటున్నారు!!
గన్నవరం నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి… వల్లభనేని వంశీ ఫ్యాన్ గుర్తుపై పోటీచేసి పరిపూర్ణమైన వైకాపా నేతగా మారబోతున్నారు అంటూ కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వల్లభనేని వంశీకి పోటీగా ధీటైన వ్యక్తిని నిలబెట్టాలనే క్రమంలో భాగంగా లొకేష్ కు ఆ అవకాశం రావొచ్చని.. తద్వారా తన కెపాసిటీ ఏమిటో, కేపబిలిటీ ఏమిటో లోకేష్ నిరూపించబోతున్నారని తమ్ముళ్లు హడావిడి చేశారు! కానీ బ్యాడ్ లక్… లోకేష్ కి తన సత్తా ఏమిటో (మరోసారి) తెలియజేసే సువర్ణావకాశం మిస్సయ్యింది!
ఈ విషయాలపై ఆఫ్ ద రికార్డ్ స్పందించిన వంశీ… తన గెలుపు తన కష్టార్జితం… ఇందులో టీడీపీ పాత్ర కొంత ఉండొచ్చేమో కానీ చంద్రబాబు పాత్ర అస్సలు లేదని గంటాపథంగా చెబుతున్నారంట! కాబట్టి… తనను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కొత్తగా రాజినామా చేస్తే ఎంత చేయకపోతే ఎంత అనే ఆలోచన వ్యక్తపరుస్తున్నారని తెలుస్తుంది!