కమల్ హాసన్ గురించి భారతీయ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్లు కొత్తగా మేముపాన్ ఇండియా స్టార్లు గా చెలామణి అవుతున్నారు.కాని ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందటే తన సినిమా లతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక తన భారతీయుడు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.
అప్పట్లో ఆ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ సినిమా కమల్ కు మరియు డైరెక్టర్ శంకర్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా కు సీక్వెల్ గా హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కలిసి ‘ఇండియన్ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే.కమల్‌హాసన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ‘ఇండియన్’ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ హాసన్ డబుల్ రోల్ చేస్తున్నారు.ఈ చిత్రంలో కమల్‌హాసన్ ఓ పాత్రలో తొంభైసంవత్సరాల వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ లుక్‌కి సంబంధించిన షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు కమల్ ఆహారం తీసుకోవడంలేదట. ప్రొస్థటిక్ మేకప్ వాడడంతో మేకప్ వేయడానికి రోజుకు నాలుగు గంటల సమయం పడుతుంది. ఇక ఆహారం తింటే దవడలు కదిలి మేకప్ పోతుందని , షూటింగ్ టైమ్ మొత్తం కేవలం పండ్ల రసాలనే తీసుకుంటున్నారట. 68 సంవత్సరాల వయస్సులో కూడా నటన కోసం ఇంత కమిట్ మెంట్ చూపించే నటుణ్ణి మనం చూడలేము.