పంచదార కంటే బెల్లం మంచిదంటారు. కానీ చాలమంది తియ్యదనం కోసం పంచదారే వాడతారు. ఎందుకంటే. మనిషికి మంచి కంటే చెడే ఎక్కువ నచ్చుతుంది కాబట్టి. చూడ్డానికి తెల్లగా అందంగా కనిపిస్తుంది..కానీ బెల్లం మాత్రం చూసేందుకు లుక్ ఏమంత బాగుండదు. వీటితో చూసిన వంటలు కూడా చూడ్డానికి నల్లగానే ఉంటాయి కానీ అంత అందంగా కనిపించవు.. దీంతో స్వీట్ల తయారీలో చాలామంది బెల్లాన్ని పక్కనపెట్టి పంచదారనే ముందు పెట్టుకుంటారు. కానీ బెల్లం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి.. ముఖ్యంగా ఊపిరితిత్తులను క్లీన్ చేయగల శక్తి బెల్లానికి ఉంది.
బెల్లం తినడం వల్ల ఐరన్ లభిస్తుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే రోజూ పిల్లలకి ఒక చిన్న బెల్లం ముక్క తినిపించని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం పౌడర్ పాలల్లో కలిపి పిల్లలకి తాగించొచ్చు. జలుబు, దగ్గు సమయంలో అల్లం, తులసి ఆకులు, బెల్లం కలిపి ఇస్తే తగ్గిపోతుంది. బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే సిమెంట్ తయారీ కర్మాగారాలు, థర్మల్ ప్లాంట్లలో పని చేసే కార్మికులకి పనికి వెళ్ళడానికి ముందు తప్పనిసరిగా బెల్లం ముక్క తినమని ఇస్టుంరా.. ఇది తినడం వల్ల ఊపిరితిత్తులని కాలుష్యం భారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు.
ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. AQI స్థాయిలు అంతకంతకు దిగజారిపోతున్నాయి. దీని వల్ల శ్వాస రుగ్మతల కేసులు పెరిగిపోతున్నాయని ఆరోగ్య నిపుణులు ల్యూక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం చాలా ఉంది. అందుకే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. తరచుగా బెల్లం తినడం వల్ల ఊపిరితిత్తులని కాపాడుకోవచ్చని అంటున్నారు. బెల్లం తినడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇది బ్రోన్కైటిస్, వీజింగ్, ఉబ్బసం, ఇతర శ్వాస రుగ్మతలకు ప్రభావవంతమైన నివారణగా పని చేస్తుందట..
బెల్లం వల్ల ప్రయోజనాలు..
బెల్లం ఆరోగ్యకరమైన ఆహారం. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
శరీరానికి కావాల్సిన ఐరన్ అందిస్తుంది.
రోగనిరోధక శక్తి పెంచుతుంది.
శీతాకాలంలో బెల్లం తినడం వల శరీరం వేడిగా ఉంటుంది.
ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది
బెల్లంతో రక్తహీనత సమస్య ఎదుర్కోవచ్చు.
అమ్మాయిల్లో మొటిమల సమస్య వేధిస్తుంటే బెల్లం తినొచ్చు. ఇది చర్మాన్ని అందంగా మారుస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా మొటిమలు త్వరగా పోతాయి లేడీస్..!!