టాలీవుడ్ లో సుకుమార్ సినిమాలు అనగానే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కథ ఎలా ఉన్నా సరే ఆయన తీసే విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. కథలో పట్టు లేకపోయినా సరే సుకుమార్ తన ప్రతిభ తో నెట్టుకొచ్చే ప్రయత్న౦ చేస్తూ ఉంటాడు. రంగస్థలం సినిమా చూస్తే ఆయనలో ఉన్న ప్రతిభ అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ సినిమాను చాలా జాగ్రత్తగా తీసారు.
ఇప్పుడు ఆయన ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. బాలీవుడ్ జనాలు ఈ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా లుక్ అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా అక్కడ బాగానే ఆడింది.
ఇప్పుడు ఈ సినిమా కథ నచ్చితే బాలీవుడ్ లో కూడా దీన్ని తీసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ సుకుమార్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ నటులను తీసుకుంటున్నారు. తద్వారా ఈ సినిమా నార్త్ లో కూడా బాగా ఆడే అవకాశం ఉంటుంది అని ఆయన భావిస్తున్నారు. అందుకే అక్కడి నటులను సినిమాలో తీసుకుని వారికి కీలక పాత్ర ఇచ్చే యోచనలో ఉన్నారని తెలుస్తుంది.