ఈ ఏడాది పండగలకు సెలవలు ఉండవా…?

-

కరోనా పుణ్యమా అని ఇప్పుడు దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నా సరే ఫలితం లేకపోవడం తో లాక్ డౌన్ ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు విద్యార్ధులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. లాక్ డౌన్ మరికొంత కాలం ఉంటే విద్యార్ధులకు పరీక్షలను నిర్వహించే అవకాశాలు కూడా ఉండవు.

లాక్ డౌన్ జూన్ వరకు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. దేశంలో కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తుంది. అవి నిదానంగా పెరగడం కలిసి వచ్చే అంశమే. దీనితో విద్యార్ధులకు పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలేని పరిస్థితి. దీనిపై ఆందోళన ఉంది… ఇప్పటికే సెలవలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ ఏడాది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నాయి. రెండో శనివారం, పెద్ద పండగలకు రోజుల తరబడి సెలవలు ఇవ్వడం, అంటే దసరా, క్రిస్మస్, సంక్రాంతికి ఇవ్వడం,

ఆగస్ట్ 15 జనవరి 26, జనవరి ఒకటి, ఉగాది, శ్రీరామనవమి కి సెలవులు ఇస్తూ ఉంటారు. దసరా కి ఒక రోజు సంక్రాంతికి మూడు రోజులు, క్రిస్మస్ కి ఒక రోజు, రంజాన్ కి ఒక రోజు మాత్రమే సెలవలను ఇవ్వాలని, ఇక మిగిలిన అన్ని సెలవలను రద్దు చెయ్యాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. విద్యార్ధులకు ఇప్పటికే చాలా నష్టం జరిగింది కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోకపోతే సిలబస్ పూర్తి కాకపోవడం విద్యలో నాణ్యతా ప్రమాణాలు ఉండవు అని భావించి… ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news