తెలంగాణలో మరో 3 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు పొడగింపు

-

తెలంగాణలో వారం రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ జిల్లా, ఈ జిల్లా అని తేడా లేకుండా అన్ని జిల్లాలో వానలు ఉతికారేస్తున్నాయి. అయితే తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. మరో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. మూడు రోజుల సెలవులు ముగియడంతో గురువారం విద్యాసంస్థలు తెలుసుకోవలసి ఉండగా.. దీన్ని మరో మూడు రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

నిన్న దక్షిణ ఒరిస్సా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఒరిస్సా తీరము & పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది.దీంతో ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news