ఆ దేశంలో ఒకరి భార్యను మరొకరు మార్చుకునే సంప్రదాయం

-

అన్ని దేశాల కంటే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. భార్యభర్తల బంధాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పెళ్లయిన తర్వాత మరో పెళ్లి కానీ, పరాయి వ్యక్తులకు కన్నెత్తి కూడా చూడరు. ఇలానే విదేశాలు కూడా తమ ఆచార, సంప్రదాయాలను, భార్యాభర్తల బంధాన్ని గౌరవిస్తారు. కానీ కొన్ని దేశాల్లో భార్యాభర్తల బంధాలు శాశ్వతంగా ఉండవనే చెప్పుకోవచ్చు. డేటింగ్ పేరుతో కొన్నాళ్లు సహజీవనం చేసిన తర్వాత.. నచ్చితే వివాహం.. లేకపోతే విడిపోతారు. అయితే ఇండియాలో కూడా కొన్ని తెగల వారు ఒకే భార్యతో అన్నదమ్ములు సంసారం చేయడం, లేదా అన్న చనిపోతే.. అతడి భార్యతో తమ్ముడు పెళ్లి చేసుకోవడం లాంటి ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ, వేరే వ్యక్తుల భార్యలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం లాంటిది చేసుకోరు.

తెగ
తెగ

కానీ, కొన్ని దేశాల్లో పెళ్లిళ్లు జరుగుతాయి. బంధాలు మాత్రం శాశ్వతంగా ఉండవు. అక్కడి సంప్రదాయం ప్రకారం.. ఒకరి భార్యను మరొకరు ఎత్తుకెళ్లి సంసారం చేయవచ్చు. అలా ఒకరి భార్యలను మరొకరు ఎత్తుకెళ్తుంటారు. ఉత్తర అమెరికా, తూర్పు సైబీరియాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో నివసించే ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తారు. అయితే ఈ ప్రాంతంలో భార్యలను మార్చుకోవడం వెనుక బలమైన రీజనే ఉంది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భిన్నంగా ఉంటాయి. తరచూ మంచు తుఫాన్లు, వరదలు, విపత్తులు సంభవిస్తూనే ఉంటాయి. దుష్టశక్తుల వల్లే ఈ విపత్తులు తలెత్తుతాయని స్థానికుల నమ్మకం. అయితే భార్యలను మార్చుకోవడం వల్ల విపత్తు కొంతమేర తగ్గుతాయని, ఎలాంటి ప్రమాదాలు సంభవించవని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు.

పశ్చిమ ఆఫ్రికాలో నివసించే నిగర్ తెగ ఆదివాసీల సంప్రదాయం ఇంకా భిన్నంగా ఉంటుంది. ప్రతి ఏటా ఈ తెగలో నిర్వహించే గెరేవాల్ ఫెస్టివల్‌లో పురుషులు తమ మర్మాంగాలు కనిపించేలా వింతైన మేకప్, దుస్తువులు ధరించి మహిళలను ఆకర్షిస్తుంటారు. ఆ సమూహంలో ఎవరైనా పెళ్లయిన మహిళలు కనిపిస్తే ఎత్తుకెళ్తారు. అలా ఎత్తుకెళ్లిన మహిళే అతడికి మళ్లీ భార్య అవుతుంది. దీంతోపాటు సైబిరియా ఎస్కిమోలు మహిళల రుతుస్రావాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. పీరియడ్స్ సమయంలో ఆ మూడు రోజులు మహిళను కలుషితంగా భావిస్తారు. పీరియడ్స్ సమయంలో మహిళతో ఒకవేళ శారీరకంగా కలుసుకుంటే ఆ వ్యక్తి సముద్రంలో మునిగి చనిపోతాడని వారి గట్టి నమ్మకం.

Read more RELATED
Recommended to you

Latest news