‘రక్షా బంధన్’ నేపథ్యంలో.. వాట్సాప్ నయా స్టిక్కర్స్..

-

ప్రజెంట్ డిజిటల్ వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు దాదాపుగా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్న అందరూ వాడే యాప్ ‘వాట్సాప్’. ఈ క్రమంలోనే ఫొటోలు, మెసేజ్‌లు, వీడియోలు అన్నీ వాట్సాప్ నుంచి కావాల్సిన వారికి పంపుతుంటారు. వాట్సాప్ అనేది కూడా ఒకరకంగా మనజీవితంలో భాగం అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నో రకాల కొత్త కొత్త స్టిక్కర్స్ తీసుకొచ్చింది వాట్సాప్. వాటిని చూసి వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాఖీ పౌర్ణమి నేపథ్యంలో కొత్త స్టిక్కర్స్ తీసుకొచ్చింది.

ఈ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ లేకుండా ప్రతీ రోజు కొందరికి జీవనం ఉండబోదని అనేలా యూజ్ చేస్తున్నారు. ఇకపోతే ‘రక్షా బంధన్’ వంటి ప్రాముఖ్యత కలిగిన పండుగ నేపథ్యంలో స్టిక్కర్స్ తీసుకురావడం పట్ల వాట్సాప్ యూజర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకొని చెల్లెలు అన్న‌య్య‌కు, అక్క‌లు త‌మ్ముళ్ల‌కు ‘రాఖీ స్టిక్కర్స్’ పంపించుకోవ‌చ్చు. ఈ రాఖీ స్టిక్కర్లను అస‌లు వాట్సాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకునేందుకుగాను గూగుల్ ప్లే స్టోర్‌‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్క‌డ‌ ‘రక్షా బంధన్ వాట్సాప్ స్టిక్కర్స్’ అని సెర్చ్ చేస్తే స్టిక్కర్ యాప్‌లు మీకు అక్క‌డ మెన్ష‌న్ అవుతాయి.

అలా మెన్ష‌న్ అయిన వాటిల్లో మీకు నచ్చిన రక్షా బంధన్ స్టిక్కర్స్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత దాన్ని ఓపెన్ య‌చేసి మ‌న‌కు ఇష్ట‌మైన రాఖీ స్టిక్కర్ ల‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత యాడ్ టు వాట్సాప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు.. వెంటనే స్టిక్కర్ ప్యాక్ మీ వాట్సాప్‌లో యాడ్ అయిపోతుంది. ఎమోజీ సింబల్స్‌పై క్లిక్ చేసి మీకు కావాల్సిన వారికి స్టిక్కర్స్‌ను పంపించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news