మంత్రి హరీష్ రావు కు మరో కీలక పదవి

-

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కు మరో కీలక పదవి దక్కింది. ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికయినట్లు ఎగ్జిబిషన్ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ముందుకు తీసుకెళ్తానని.. ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ప్రగతి పథంలో నడిచేలా శక్తివంచన లేకుండా పని చేస్తానని తనను కలిసిన సోసైటీ యాజమాన్య కమిటీ ప్రతినిధులతో అన్నారు. నా బాధ్యత మరింత పెరిగిందన్న ఆయన ప్రతిష్టాత్మక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని పేర్కొన్నారు. గత 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నుమాయిష్ ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామన్నారు. సోసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామని వెల్లడించారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news