కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రాష్ట్ర సచివాలయ ఉద్యోగి ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగింది. వాట్సాప్ వేదికగా ఉద్యోగి చేసిన వ్యాఖ్యలపై సీఎం కార్యాలయ సిబ్బంది స్పందిస్తూ.. సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్లితే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ఖ ఇటీవల యూఈఐ దూశంలో పర్యటించారు. కేరళ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అక్కడి విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ మానవ వనరుల అభివృద్ధశాఖలో తో సమావేశం అయ్యారు. యూఏఈ మంత్రులు అధికారులతో కలిసి దిగిన ఫొటోను సీఎం విజయన్ ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.
సీఎం విజయన్ నల్ల సూట్ వేసుకుని ఉన్న ఆ ఫొటోను మణికుట్టన్ అనే సచివాలయ ఉద్యోగి తన వాట్సాప్ గ్రూపులో షేర్ చేసాడు. గుండాలు వేర్వేరు వేషాదారణలో ఉన్నారంటూ సీఎంపై మణికుట్టన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్నీ కొందరూ సచివాలయ అధికారులు సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా.. మణికుట్టన్ విధుల నుంచి తప్పించారు. మణికుట్టన్ కాంగ్రెస్ అనుకూల సచివాలయం ఉద్యోగ సంఘంలో సభ్యునిగా ఉన్నాడు. దీంతో అతనిపై కక్ష కట్టిన అధికార పార్టీ అనుకూల సచివాలయ ఉద్యోగుల సంఘం సభ్యునిగా ఉన్నాడు. దీంతో అతనిపై కక్ష కట్టిన అధికార పార్టీ అనుకూల ఉద్యోగులు కొందరు ఈ చర్యకు పాల్పడ్డారు.