తెలంగాణలో నియంత్రణలోకి కరోనా వ్యాప్తి : హరీష్‌ రావు కీలక ప్రకటన

-

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల DMHO లు, Addl DMHOs, ప్రోగ్రాం ఆఫీసర్లు, DIO(Dist Immunisation Officers)లు, PHC డాక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఫీవర్ సర్వే రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి పైగా ఇండ్లు కవర్ చేశామని.. అన్ని జిల్లాల్లో దాదాపు మొదటి రౌండ్ పూర్తి అయ్యింది. రెండో రౌండ్ ఫీవర్ సర్వే కొనసాగుతున్నదని పేర్కొన్నారు.

కోవిడ్ ఓపీ కొనసాగించడం తో పాటు, ఏవైనా మండలాలు, ఇతర ప్రాంతాల్లో కరోనా కేసుల పెరుగుదల గుర్తిస్తే అవసరాన్ని బట్టి రెండో, మూడో ఫీవర్ సర్వేలను కొనసాగించాలని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ అన్ని కేటగిరీల్లో వంద శాతం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. తక్కువ ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. 18 ఏళ్లకు పైబడిన వారికి రెండు డోసులు, 60 ఏళ్లకు పైబడి కోమార్బిడ్స్ ఉన్నవారికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రికాషన్ డోసు, 15-17 మధ్య వయసు వారికి రెండు డోసులు అన్ని జిల్లాలో 100% పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు.

18 ఏళ్లకు పైబడిన వారికి 31 జిల్లాల్లో 100 % టీకాలు వేశారు. నిజామాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ కూడా పూర్తి చేస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లో 100% లక్ష్యం పూర్తవుతుందని..కరోనా వైద్య సేవలు అందించడంతో పాటు సాధారణ వైద్య సేవలు, ఎన్ సీ డీ స్క్రీనింగ్, ఆరోగ్య పరీక్షలన్నీ టి డయాగ్నస్టిక్ కేంద్రాలలో చేయడం, ఇతర ఆరోగ్య కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news