దేశవ్యాప్తంగా రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. కఠిన చట్టాలు శిక్షలు కామాంధుల నుంచి మహిళలకు రక్షణ కల్పించ లేకపోతున్నాయి. ఇటీవలే హత్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇలా దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఆకృత్యాలు పై.. నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న దారుణ అత్యాచారాలు ఏకంగా దేశానికి అవమానకరంగా మారుతున్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఇలాంటి ఘటనలకు వెంటనే చరమగీతం పాడేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభ్యర్థించారు కైలాస్ సత్యార్థి. హత్రాస్ జరిగిన ఈ దారుణ ఘటనపై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా అత్యాచారాలపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మన ఆడపిల్లలను కాపాడుకోవడంలో మనమే విఫలం అవుతున్నాం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన.