లోకేష్ కు ఫోటోలు, వీడియోలు, పేపర్ కటింగ్స్ పంపుతున్నారంట!!

-

రాజకీయాల్లో అవకాశాలు అస్తమానం రావు.. వచ్చినప్పుడు సరైన సమయంలో సరిగ్గా వాడుకుంటే ఫుల్ మైలేజ్ వస్తుంది! ఇందుకు తాజా ఉదాహరణ… కాంగ్రెస్ జాతీయ నాయ‌కుడు రాహుల్‌గాంధీ! ఉత్తరప్రదేశ్ ‌లోని హాథ్రి‌సలో 19 ఏళ్ల దళిత అమ్మాయిని నలుగురు వ్యక్తులు గ్యాంగ్‌ రేప్ చేయ‌డంతో పాటు చంప‌డంతో యావ‌త్ దేశ‌మంతా ర‌గిలిపోతోంది. సరిగ్గా ఆ విషయాన్ని రాజ‌కీయంగా క్యాష్ చేసుకునేందుకు రాహుల్ ఆయన సోదరితోకలిసి రోడ్డెక్కారు!

అవును… ఇంతకాలం రాహుల్ గాంధీని పప్పు అనిపిలిచిన వాళ్లు సైతం “శభాష్” అంటూ నినదిస్తున్నారు. మోడీ స‌ర్కార్‌ పై రాహుల్‌ గాంధీ నుంచి ఈ రేంజ్ ఫైటింగ్ స్పిరిట్ కావాలంటూ దేశ ప్ర‌జలు ముక్త‌కంఠంతో నిన‌దిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం.. అధికారపక్షం ఎంత బలంగా ఉందో.. ప్రతిపక్షం ప్రజల తరుపున అంతే బలంగా ఉంటే… ఫైనల్ గా ప్రజలకు కంఫర్ట్! ఇప్పుడు ఆ కంఫర్ట్ ఇవ్వడానికి రాహుల్ రంగంలోకి దిగారు!

సరే… కచ్చితంగా మోడీ రెండోసారి పాలనలో అప్రకటిత నియంతృత్వ పాల‌న సాగిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నా.. గట్టిగా ప్రతిస్పందించే ప్రతిపక్షం కరువైంది! కానీ… నిన్నటితో ఆ లోటు తీరిపోయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు! రాహుల్ తన సోదరి ప్రియాంకతో కలిసి ఇకపై వెనక్కి తగ్గకుండా ముందుకు దూకాలని కోరుకుంటున్నారు!

వారి సంగతి అలా ఉంటే… మరి ఏపీలో చినబాబు పరిస్థితి ఏమిటి? ఏపీలో ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు పీక్స్ కి చేరాయని రోజంతా ట్విట్టర్ లో రాసుకొస్తున్న చినబాబు… వాటిలో ఏ ఒక్క విషయంపైనా పోరాటాలు చేయరెందుకు? తాను చేస్తున్న విమర్శలపై తనకే నమ్మకం లేదా లేక అవన్నీ కేవలం రాజకీయ విమర్శలు అనుకోవాలా? అదీగాక.. ట్విట్టర్ లో స్పందిస్తే చాలు అనుకుంటున్నారా? చినాబుకే తెలియాలి!

కష్టే ఫలి అన్నారు కానే… ట్వీటే ఫలి అని ఎవరూ అనలేదు, అనరు కూడా! మరి చినబాబుకు ఈ విషయంలో ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో ఏమో? దీంతో… ఇక చినబాబుతో వేగలేక, చెప్పలేక విసిగిపోయిన ఆయన అభిమానులు… తాజాగా రాహుల్ చూపించిన తెగువ, పోరాట స్పూర్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, న్యూస్ పేపర్ కటింగ్స్ పంపుతున్నారంట!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news