బిజినెస్ చేయాలనే కోరిక మీకు ఉందా? అయితే ఎలాంటి బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయో..ఇప్పుడు చుద్దాము..మీకోసం ఓ బిజినెస్ ఐడియా ఉంది. అదే కుందేళ్ల పెంపకం..వీటి మాంసంకు మంచి డిమాండ్ కూడా ఉంది..అందుకే ఇప్పుడు చాలా మంది వీటిని పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ కుందేళ్ల పెంపకం కు ఎంత ఖర్చు అవుతుంది.ఎలా పెంచితే మంచి డిమాండ్ ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఓ యువతికి ఆరోగ్యం పై వచ్చిన ఆలోచన ఇప్పుడు వ్యాపారంగా మారింది..లక్షల్లో ఆదాయాన్ని పొందుతుంది.సంగారెడ్డి కి చెందిన యువతి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టింది. తన సక్సెస్ ను తానే వివరించింది.కుందేళ్ల పెంపకానికి తగ్గట్టుగా ఇనుప కేజ్‌లు ఏర్పాటు చేశాను. 4 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు. కుందేళ్ల ప్రెగ్నెన్సీ పీరియడ్ 28 నుంచి 30 రోజులు. క్రాస్ చేసిన నెల రోజులకి పిల్లల్ని పెడతాయి. ఒక కాన్పులో రెండు నుంచి పన్నెండు పిల్లల్ని పెడతాయి. ఇప్పుడు మా ఫామ్‌లో పిల్లలు, పెద్దవి కలిపి ఐదొందల కుందేళ్లు ఉన్నాయి.
అంగోరా, న్యూజిలాండ్ వైట్, చించిల్లా, కాలిఫోర్నియా, డచ్, ఇంగ్లీషు స్పాట్, సిన్నమిన్, బ్లాక్ జెయింట్, ఫ్లెమిష్ జెయింట్.. అనే తొమ్మిది రకాల కుందేళ్లను పెంచుతున్నారు.పొద్దున పది గంటలకు, సాయంత్రం నాలుగ్గంటలకు గడ్డి వేస్తాం. ఈ గడ్డిలో సూపర్, స్మార్ట్, ఆల్ఫా ఆల్ఫా, హెడ్జ్ల్యూసెన్ అని నాలుగు రకాలు ఉంటాయి. నిపుల్ సిస్టం ద్వారా నీళ్లు పెడుతున్నా. కుందేళ్లు 45 రోజుల్లో కిలోన్నర బరువు వరకు పెరుగుతాయి. వీటి కూర నారనారగా, ముదిరినట్టు ఉండదు. అంతేకాదు రెడ్‌మీట్, చికెన్, మటన్‌లో లాగా కుందేలు మాంసంలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు. ఇది వైట్‌మీట్ కాబట్టి దీన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తినొచ్చు. త్వరగా అరుగుతుంది కూడా. ఇందులో ఐరన్, ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండెజబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా వీటిని తినవచ్చు..
మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ..రూ.850 నుంచి 900 రూపాయ లకు కుందేలు మాంసం దొరుకుతోంది. నేను మాత్రం రూ.800 లకు కిలో అమ్ముతున్నా. లైవ్ ర్యాబిట్ అయితే రూ.700. ఒక యూనిట్ బ్రీడర్స్ని 12 నుంచి 15 వేల రూపాయలకు ఇస్తున్నా. రెండు బన్నీస్ కావాలంటే వెయ్యి నుంచి పన్నెండొందలు. హోటళ్లు, రెస్టారెంట్ల వాళ్లతో అగ్రిమెంట్ చేసుకోవాలి అనుకుంటున్నా. కుందేళ్లని ల్యాబొరేటరీస్‌కు కూడా ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఇప్పటివరకైతే మాంసం, బన్నీస్ అమ్మి నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నా… అందులో కూలీల ఖర్చు, ఇతర ఖర్చులు పోగా 50 వేలు నెలకు మిగులుతున్నాయి..ఈ బిజినెస్ చేయడం చాలా ఈజి అని ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది..