చంద్రబాబు కంటతడి ఎఫెక్ట్ : కొడాలి నాని, వల్లభనేని వంశీకి భద్రత పెంపు..

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతాకాల సమావేశాలు ఎన్నడూ లేని విధంగా చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడి ఘటన… మూడు రాజధానులు బిల్లు రద్దు, అలాగే శాసన మండలి బిల్లు రద్దు లాంటి అంశాలతో ఏపీ అసెంబ్లీ హాట్ హాట్ గా నడుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడి అంశం వైసీపీ నేతలు ఆందోళనకు గురి చేస్తోంది.

చంద్రబాబు నాయుడుపై.. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లు అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎప్పుడైనా ఆ నాయకులపై దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు టిడిపి నేతలు. ఇలాంటి తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

మంత్రి కొడాలి నానీకి ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్ల భద్రతో పాటు అదనంగా 1+4 గన్ మెన్ల భద్రత పెంచింది జగన్ మోహన్ ప్రభుత్వం. కాన్వాయ్ లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కల్పించింది. దీంతో కొడాలి నానికి ఇకపై 7+7 భద్రత ఉండనుండగా.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ లకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్ మెన్ ల తో పాటు అదనంగా 3+3 గన్ మెన్ భద్రత కల్పించింది జగన్ సర్కార్. దీంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇకపై 4+4 భద్రత ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news