రైతులు , నేతన్నల ఆత్మహత్యలు కనిపించడం లేదా దొరా..? – వైఎస్ షర్మిళ

-

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎష్ షర్మిళ మరోసారి సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. ఇటీవల వరసగా ట్విట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ పై విమర్మనాస్త్రాలు సంధిస్తున్నారు. ధాన్యం కొనుగోలు, రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేశారు.

వైఎస్ షర్మిళ ట్విట్టర్ లో ’’ ఢిల్లీలో రాజకీయాలు చేసే దొరగారికి ఇక్కడ రైతుల చావులు, నేతన్నల ఆత్మహత్యలు కనిపించడం లేదు. పెట్టిన పెట్టుబడి రాక, పండిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుంటే.. అప్పులు తీరక గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ గారికి మాత్రం కనిపించడం లేదు. పంటలు కొనండి అంటూ గుండెలు ఆగేలా మొత్తుకున్నా..కేసీఆర్ కు మాత్రం చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే ఉంది. ఆఖరి గింజ వరకు కొంటామన్న దొరగారూ.. ఇప్పటికైనా మీ డ్రామాలు పక్కన పెట్టి కాళ్లు పట్టుకుంటున్న రైతులు, గల్లా పట్టుకోకముందే రైతుల ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం‘‘ అంటూ వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news