నగరాల్లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

-

ఒకవైపు కరోనా విస్తరించి ఇబ్బందులు తీసుకొస్తున్న తరుణంలో మరోవైపు డెంగ్యూ ( Dengue ) భయపెడుతుంది. వర్షాకాలం కారణంగా దోమల బెడద బాగా పెరిగింది. ముఖ్యంగా నగరాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. నాళాల్లో లార్వా అభివృద్ధి తీవ్రంగా ఉండడంతో ఆ ప్రాంతాల్లోని వారికి డెంగ్యూ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో అధికార్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. నాళాలను పరిశుభ్రంగా ఉంచకపోవడం, నీరు నిల్వ ఉండేలా చేయకపోవడం వంటి చర్యలు తీసుకోనందు వల్లే డెంగ్యూ విజృంభిస్తుందని నగర ప్రజలు అంటున్నారు.

 

dengue | డెంగ్యూ
Dengue | డెంగ్యూ

తెలంగాణ వ్యాప్తంగా ఈ సంవత్సరం ఇప్పటికే 1206డెంగ్యూ కేసులు నమోదయినట్లు సమాచారం. అనధికారంగా ఈ లెక్కలు ఇంకా ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది.

తాజా అధ్యయనం ప్రకారం నగరాల్లో దోమల లార్వా అభివృద్ధి విపరీతంగా పెరిగిందని, గరిష్టంగా హైదరాబాద్ లో 46శాతం ఉందని తెలిపింది. ఈ లెక్కన నగర వాసులకు డెంగ్యూ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హైదరాబాద్ కాకుండా మిగతా జిల్లాల్లోనూ ఇది పెరిగిందని, ప్రతీ జిల్లాలో 10శాతం పెరిగినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో డెంగ్య్ కిట్లు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు, హైదరాబాద్ లోని ఫీవర్, నీలోఫర్, ఉస్మానియా మొదలగు ఆస్పత్రుల్లో డెంగ్యూ కిట్లు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే డెంగ్యూ సోకిన వారిలో ప్లేట్ లెట్ల కొరత ఏర్పడుతుంది. ఆ కొరత తీర్చడానికి కొన్ని సార్లు ప్లేట్ లెట్లు ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ఐతే ఒక మనిషిలో 20వేల కంటే తక్కువకి ప్లేట్ లెట్లు పడిపోయినపుడు మాత్రమే ఎక్కించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 50వేల సంఖ్యలో ఉన్నప్పటికీ ఎక్కించాల్సి వస్తుంది. ఈ ప్లేట్ లెట్లు సాధారణంగా 1,50,000 నుండీ 4,50,000వరకు ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news