IND A vs PAK A: పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇండియా కుర్రాళ్ళు … !

-

ఎసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా ఈ రోజు ఇండియా మరియు పాకిస్తాన్ ఎ జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ వారి ఇన్నింగ్స్ ఏమంత సవ్యంగా కొనసాగడం లేదు. యంగ్ ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ ఆటగాళ్లకు బొమ్మ చూపిస్తున్నారు. వాస్తవంగా ఈ టోర్నమెంట్ లో ఇండియా తర్వాత చక్కని ప్రదర్శన చేస్తోంది పాకిస్తాన్ మాత్రమే. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఇండియా బౌలర్లు వారిని అల్లాడించారు. ముఖ్యంగా హాంగార్గేకర్ ఇన్నింగ్స్ మూడవ ఓవర్ లోనే రెండు కీలక వికెట్లు తీసుకుని పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చాడు. అప్పటి నుండి పాకిస్తాన్ కోలుకోలేదు.. వరుసగా వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

మరో బౌలర్ మానవ్ సుతర్ మూడు వికెట్లతో చెలరేగి పాకిస్తాన్ ను కట్టడి చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్ 7 వికెట్లు కోల్పోయి కనీసం 200 పరుగులు అయినా చేస్తుందా అన్న సందేహాన్ని కలిగించింది.

Read more RELATED
Recommended to you

Latest news