హైదరాబాద్ లో భారీ వర్షాలు, పారిశుద్ధ్యం పై బుధవారం నానక్ రామ్ గుడాలోని హెచ్బీసీఎల్ కార్యాలయంపై మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని.. ఎట్టి పరిస్థితులలోనూ ప్రాణనష్టం వాటిల్లకూడదని సూచించారు.
ఇతర అన్ని శాఖలతో జిహెచ్ఎంసి సమన్వయం చేసుకొని నగరవాసులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్యం పై ప్రధానంగా ఫోకస్ చేయాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. ఈ సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిహెచ్ఎంసి కమిషనర్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.