INDvsNZ : ఉప్పల్ మ్యాచ్‌కు నేడు ఫిజికల్ టికెట్ల జారీ

-

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హైదరాబాదులో మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో ఎల్లుండి అంటే ఈ నెల 18వ తేదీన జరగనున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల అమ్ముడు అవుతున్నాయి.

ఆన్లైన్ లో శనివారం 6000 టికెట్లు, ఆదివారం 7000 టికెట్లు అమ్ముడు పోగా… నేడు సాయంత్రం 5 గంటలకు మరో 7 వేల టికెట్లు విడుదల చేస్తారు. టికెట్ బుక్ చేసుకున్న వారికి నేడు మరియు రేపు గచ్చిబౌలి మరియు ఎల్బీ స్టేడియాలలో 16 కౌంటర్లలో ఫిజికల్ టికెట్స్ ఇవ్వనున్నారు. అయితే గతంలో లాగా తొక్కిసలాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news