జబర్దస్త్ కమెడియన్ కి లిప్ కిస్ ఇచ్చిన హీరోయిన్.. టీజర్ వైరల్..!

-

జబర్దస్త్ లో నటించిన ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకొని.. హీరోగా అవతారం ఎత్తిన వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. గెటప్పుల స్పెషలిస్ట్ గా పేరుందిన అతడు సుదీర్ఘకాలంగా సత్తా చాటుతున్నాడు. చిరంజీవి వీరాభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన చిరంజీవి నటించిన చాలా సినిమాలలో ఈ మధ్యకాలంలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక పోతే తాజాగా ఈయన హీరోగా మారి “రాజు యాదవ్” సినిమాలో హీరో గా చేస్తున్నాడు.

నీది నాది ఒకే కథ, విరాటపర్వం వంటి చిత్రాలకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన కృష్ణమాచారి ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అంకిత కరత్ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది అని చెప్పవచ్చు. గెటప్ శ్రీను హీరోగా నటిస్తున్న రాజు యాదవ్ మూవీ నుంచి సంక్రాంతి కానుకగా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో క్రికెట్ ఆడుతుండగా పెదాలకు దెబ్బ తగిలి ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా హీరో ముఖం తయారవుతుంది.

అలాంటి అతడి జీవితంలో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత కొన్ని గొడవలు.. వంటి అంశాలతో సినిమాలు రూపొందించారు. ముఖ్యంగా ఇందులో గెటప్ శ్రీను తనదైన నటనతో విశ్వరూపం చూపించారు. అంతేకాదు ఈ వీడియో చివర్లో హీరోయిన్ అతడికి లిప్ కిస్ ఇవ్వడాన్ని కూడా మనం చూడవచ్చు. మొత్తానికైతే ఈ టీజర్ బాగా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news