‘సెట్టింగ్ ది పేస్’ అనే థీమ్ మీద ఇండియా గ్లోబల్ ఫోరమ్ ని నిర్వహించారు. భూపేందర్ యాదవ్, మినిస్టర్ అఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ అఫ్ ఇండియా.
మినిస్టర్ పర్యావరణం పరిరక్షణ గురించి మాట్లాడారు. అలానే మనం పర్యావరణాన్ని రక్షించడానికి ఎంతైనా అవసరం ఉందని తన అభిప్రాయాన్ని చెప్పారు. అడవి మరియు పర్యావరణం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి, చట్టపరమైన అంశాల గురించి కూడా మాట్లాడారు. మరిన్ని వివరాలు గురించి చూస్తే… రిఫ్లెక్షన్స్ ఆన్ లైఫ్ ఇండియాస్ పాత్ టు గ్రీన్ గ్రోత్ గురించి ఉపేందర్ యాదవ్ చెప్పారు. భారతదేశం NDCs ని 2015లో 9 ఏళ్ళ ముందుగానే సాధించిందని చెప్పారు.
2015 కట్టుబాట్ల ప్రకారం 2021లో 165 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడం మా లక్ష్యం అని.. ఆ లక్ష్యాన్ని కూడా సాధించాము అని అన్నారు. అలానే మెరుగుపరచబడిన NDCలను కూడా సబ్మిట్ చేసాము అని చెప్పారు. పునరుత్పాదక రంగంలో ఇండియా పెట్టుబడులు పెట్టింది. పునరుత్పాదక శక్తి కోసం మన సామర్థ్యం ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ రేటుతో పెరుగుతోంది అని అన్నారు. అంతే కాక
జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు భూమి, సముద్ర ప్రాంతాలలో ముప్పై శాతం రిజర్వ్ చేయడానికీ ఒప్పుకున్నాము అని మంత్రి అన్నారు.
16 ప్రాంతాలను జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లుగా ప్రకటించాము అని కూడా చెప్పారు. మైండ్‌ఫుల్ వినియోగాన్ని ప్రోత్సహించే విధానంగా ఉండాలని బుడ్డి లేకుండా ఖర్చు చేయడం కోసం కాదు అని అన్నారు. అలానే జీవవైవిధ్యాన్ని సంరక్షించడంతో పారిశ్రామికీకరణను సమతుల్యం చేయడం అంశం మీద కూడా చెప్పారు. USD 100bn క్లైమేట్ ఫైనాన్స్ ఫండ్, అనుబంధ సాంకేతికత బదిలీ గురించి అభివృద్ధి చెందిన దేశాలకు పిలుపుని ఇచ్చారు. ఆ తరవాత ఇండియా గ్లోబల్ ఫోరమ్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ ప్రొఫెసర్ మనోజ్ లాడ్వా వాతావరణ సాంకేతిక ఆవిష్కరణలలో భారతదేశం గురించి చెప్పారు. క్లీన్ టెక్ కంపెనీలు కోసం పని చేస్తాము అని అన్నారు.