రవితేజ “రావణాసుర” ట్రైలర్ రిలీజ్

-

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం “రావణాసుర”. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామ, రవితేజ కలిసి నిర్మిస్తున్నారు. సుశాంత్ మొదటిసారి నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ యాక్షన్ త్రిల్లర్ లో అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్. అలాగే రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథను అందించారు. ఇక ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో, రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకి రానున్న రావణాసుర మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రావణాసుర టీజర్ కి సూపర్ రెస్పాన్స్ రావడం, రావణాసుర థీమ్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకు వెళ్లడానికి మేకర్స్ తాజాగా రావణాసుర ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కట్ చేసి విడుదల చేసిన ఈ ట్రైలర్ లో రవితేజ యాక్టింగ్, డైలాగ్స్, హైపర్ ఆది కామెడీ, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు రవితేజ. ” మర్డర్ చేయడం క్రైమ్.. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్” అంటూ రవితేజ చెప్పే మాస్ డైలాగ్ కి థియేటర్లో విజిల్స్ పడడం పక్కా. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాతో రవితేజ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటే ఏప్రిల్ 7 వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news