I.N.D.I.A. కూటమిపై పీయూష్ గోయల్‌ వివాదస్పద వ్యాఖ్యలు.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

-

ప్రతిపక్షాలపై రాజ్యసభా పక్ష నేత పీయూష్‌ గోయల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ‘ఇండియా’ కూటమి ఫ్లోర్‌ లీడర్లు ప్రివిలేజ్‌ మోషన్‌ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలను దేశద్రోహులుగా అభివర్ణించినందుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై ప్రతిపక్ష కూటమి I.N.D.I.A. నేతలు మంగళవారం రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు గాను పీయూష్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రాజ్యసభలో I.N.D.I.A. కూటమి పార్టీల సభ్యులను దేశద్రోహులు అని సంబోధించినందుకు సభా నాయకుడు పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్ మోషన్‌ను ఇచ్చాం. ఆయన క్షమాపణ చెప్పాలి’ అని జైరామ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Rajya Sabha Live, Piyush Goyal, Jairam Ramesh, Newsclick Controversy:  "Nothing Less Than...": Opposition Moves Privilege Motion Against Piyush  Goyal

జైరామ్ రమేశ్ మరో ట్వీట్‌లో.. పరస్పర చర్చల తీర్మానం ఆధారంగా మణిపూర్‌పై తక్షణ చర్చకు మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా నిరాకరిస్తున్నారని, ప్రతిపక్ష నాయకులపై పీయూష్ గోయల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు పీయూష్ గోయల్ రాజ్యసభలో ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, సంకీర్ణ పార్టీలు చైనా మీడియాకు మద్దతిస్తున్నాయని, కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఇది తీవ్రమైన అంశం అన్నారు. ఈ అంశంపై సభలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అహంకారపూరిత సంకీర్ణ పార్టీలు ఒకదానికి మరొకటి సహాయం చేసుకుంటున్నాయని, దేశంపై దుష్ప్రచారానికి నిధులు సమకూరుస్తున్నాయన్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి, చైనాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధమో చెప్పాలన్నారు. వారు భారత్‌తో ఉన్నారా? చైనాతో ఉన్నారా? తెలుసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news