మతం ఆధారంగా ఇండియా కూటమి రిజర్వేషన్ల చట్టం తీసుకు వస్తుంది : మోడీ

-

ఇండియా కూటమి పై నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. మత ప్రాతిపదిక రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తిరగరాస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..”దేశంలోని మెజారిటీ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాలని ప్రతిపక్ష ఇండియా కూటమి భావిస్తోంది అని మండిపడ్డారు.

ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇండియా కూటమి వివిధ కులాలు తమను తాము కొట్టుకునేలా చేస్తోంది అని ఆరోపించారు. కూటమిలో భాగస్వామ్యం అయిన సమాజ్‌వాదీ పార్టీ పూర్వాంచల్‌ని మాఫియా, పేదరికానికి అడ్డగా మార్చింది అని అన్నారు. కులాలు బలహీనంగా మారేందుకు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు.రాత్రికి రాత్రే ముస్లిం కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తున్నారు. ఇటీవల కలకత్తా హైకోర్టు 77 ముస్లిం కులాలకు ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లను తిరస్కరించింది అని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news