ఇండియాలో కొత్తగా 42,766 కరోనా కేసులు.. సగానికి పైగా కేరళ లోనే !

చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటు కరోనా మహమ్మారి మన దేశాన్ని కూడా కుదిపేస్తోంది. అయితే మొన్నటి వరకు దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ… ప్రస్తుతం మళ్లీ ప్రతిరోజు 40వేలకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… నిన్నటి కంటే ఇవ్వాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. భారత్ లో గడచిన 24 గంటల్లో కొత్తగా… 42, 766 కరోనా కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం మన దేశంలో 4,10,048 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.42 శాతంగా నమోదైంది. అలాగే దేశంలో ఇప్పటివరకు 66.89 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది. ఇక దేశంలో నమోదైన కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కేరళ రాష్ట్రంలో కొత్తగా 29 వేల ఆరు వందల ఎనభై రెండు కరోనా కేసులు నమోదు కాగా 142 మరణాలు సంభవించాయి. ఇక కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో వీకెండ్ లాక్ డౌన్ ను అమలు చేస్తుంది ఆ రాష్ట్ర సర్కార్.