భారీ వ‌ర్షసూచ‌న‌..తెలంగాణ‌కు ఎల్లో అల‌ర్ట్..!

తెలంగాణ‌లో గ‌త వారం రోజులుగా ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌తో రాష్ట్రంలోని వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ఇక హైద‌రాబాద్ లో అయితే ప్ర‌తి రోజూ కురుస్తున్న వ‌ర్షాల‌తో ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. అంతే కాకుండా ట్రాషిక్ జామ్ అవ్వ‌డంతో వాహ‌నదారులు కూడా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే తాజాగా మ‌రో రెండు రోజు పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

బంగాళాకాతంలో ఏర్ప‌డిన ఆవ‌ర్త‌నం ప్ర‌భావంతో రాబోయే 24గంట‌ల్లో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. దాంతో తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ఈరోజు రేపు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణశాఖ హెచ్చ‌రించింది. దాంతో తెలంగాణ‌లోని అన్ని జిల్లాల‌కు ఈరోజు ఐఎండీ ఎల్లో అల‌ర్ట్ ను ప్ర‌క‌టించింది.