భారత్ లో కరోనా కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా నమోదయిన కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 61 లక్షల 45 వేలు దాటింది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటలలో 70,589 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 61,45,292కు చేరింది. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 776 మంది మృతి చెందారు. దీంతో కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 96,318కు చేరింది.
గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 84,878 కాగా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 51,01,398కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా 9,47,576 యాక్టీవ్ కేసులు ఉండగా దేశంలో 82.58 శాతం కరోన రోగుల రికవరీ రేటు ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 15.85 శాతంగా ఉండగా మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.57 శాతానికి తగ్గింది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 11,42,811 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా దేశంలో 7,31,10,041 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు.