వెయ్యి తగ్గిన కరోనా కేసులు.. ఈరోజు 83 వేలకు పైగా !

-

భారత్ లో కరోనా కల్లోలం ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రతి రోజూ ఎనభై వేలకి పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోజు చేసే పరీక్షలు పెంచడంటో నమోదయ్యే కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగి పోతోంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83,341 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,096 మంది మరణించారు.

coro

ఇక నిన్నటిదాకా నమొదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 39 లక్షలను దాటింది. మొత్తం కేసుల సంఖ్య 39,36,748గా ఉంది. ఇక ఈ కేసులలో 8, 31,124 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 30,37,152 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 68,472 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా పరీక్షలను కూడా భారీగా చేస్తుంది కేంద్రం. ప్రతీ రోజు పది లక్షలకు పైగా పరీక్షలు చేయడం టార్గెట్ గా పెట్టుకుని మరీ పరీక్షలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news