టీకా వేసుకొకపోతే రేషన్, ఫించన్ కట్..మెప్మా సిబ్బంది వార్నింగ్…!

-

ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు త్వ‌ర‌గా వ్యాక్సిన్ లు ఇవ్వాల‌ని ఆరోగ్య కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకోని వారికి ఎలాగైనా వాక్సినేష‌న్ పూర్తిచేయాలని ఆరోగ్య కార్యకర్తలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోని వారికి రేషన్, ఫించన్లు నిలిపివేస్తామని మెదక్ జిల్లా నర్సాపూర్ లో మెప్మా సిబ్బంది, ఆశ కార్యకర్తలు ప్రచారం చేశారు.

వ్యాక్సిన్ వేసుకుంటే క‌రోనా నుండి దూరంగా ఉండవచ్చని ఎలాంటి అపోహలు అవసరం లేదని ఇంటింటికి ప్రచారం చేశారు. దేశంలో ఇప్పటికే కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకున్నారని కాబట్టి భయపడకుండా వేసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ వేసుకున్న వారి ఇళ్లను గుర్తించేందుకు స్టిక్కర్లను అందిస్తున్నారు. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా వ్యాక్సిన్ వేసుకునేందుకు కొంత మంది ప్రజలు దూరంగా ఉండటం వల్లే ఆశ వర్కర్లు ఇలాంటి ప్రచారం మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news