ఇండియాలో కొత్తగా 14,623 కరోనా కేసులు.. 99 కోట్లు దాటిన వాక్సినేషన్

-

చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి… ప్రస్తుతం ఇండియాలో తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు ప్రస్తుతం 15 వేల లోపే నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఇండియా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కేవలం 14623 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,08,996 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,78,098 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 99.01 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 197 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,52,651 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,446 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,34,78,247 కు చేరింది. గడిచిన 24 గంటల్లో మాత్రం 41,36,142 మందికి వ్యాక్సిన్‌ వేసింది ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 99,12,82,283 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక రేపటికి 100 కోట్ల వ్యాక్సినేషన్ టార్గెట్ ను అందుకోనుంది ఇండియా.

Read more RELATED
Recommended to you

Latest news