తాలిబన్ రాజ్యం ఆఫ్టనిస్థాన్ కు భారత్ భారీ సాయం చేసింది. ఆఫ్ఢనిస్థాన్ కు 5 లక్షల కోవాగ్జిన్ డోసులను భారత ప్రభుత్వం అందజేసింది. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంటు వణికిస్తున్నాయి. వీటి ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే.. తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ లను తీసుకోవాలి. కానీ తాలిబన్ దేశం అయిన ఆఫ్ఘనిస్థాన్ దేశంలో ఎలాంటి వ్యాక్సిన్లు లేవు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ కరోనా వైరస్ తో తీవ్రంగా నష్ట పోతుంది. నిజానికి ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటికే తాలిబన్ల ఆక్రమణతో తీవ్రంగా నష్ట పోయింది. మళ్లీ ఇప్పుడు కరోనా మహమ్మారి, ఓమిక్రాన్ వేరియంట్ తో దుక్కుతోచని పరిస్థితులలో ఉంది.
ఆ దేశానికి సాయం చేయడానికి ఏ దేశం కూడా ముందుకు రావడం లేదు. డబ్యూహెచ్‌వో పలు దేశాలను కోరినా.. ఆఫ్ఘాన్ కు సాయం చేయడానికి ఇప్పటి వరకు ఏ దేశం ముందుకు రాలేదు. ఇలాంటి సందర్భంలో ఆఫ్ఘాన్ ను భారత ప్రభుత్వం ఆదుకుంది. 5 లక్షల కోవాగ్జిన్ టీకాలను కాబుల్ లోని ఇందిరా గాంధీ పిల్లల ఆస్పత్రికి భారత ప్రభుత్వం అందజేసింది. అంతే కాకుండా మరో వారం రోజుల్లో మరో 5 లక్షల కరోనా వ్యాక్సిన్ లను అందజేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది.