త‌మిళ స్టార్ హీరోతో జాతి ర‌త్నాలు డైరెక్ట‌ర్ అనుదీప్ సినిమా

-

జాతి ర‌త్నాలు వంటి సూప‌ర్ కామెడీ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేసి భారీ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్ అనుదీప్ చాలా ఫేమ‌స్ అయ్యారు. జాతి ర‌త్నాలు సినిమా త‌ర్వాత డైరెక్ట‌ర్ అనుదీప్ త‌ర్వాత సినిమా చేయ‌డానికి కాస్త స‌మ‌యం తీసుకున్నాడు. అయితే తాజాగా ఆయ‌న త‌ర్వాత సినిమా గురించి ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. త‌మిళ స్టార్ హీరో శివ కార్తికేయ‌న్ తో అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రానుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. కాగ హీరో శివ కార్తికేయ‌న్ హీరోగా పూర్తి తెలుగులో వ‌స్తున్న మొద‌టి సినిమా ఇదే.

కాగ ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే ఈ సినిమా సంగీత ద‌ర్శ‌కుడిగా ఎస్ ఎస్ థ‌మ‌న్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. కాగ ఈ సినిమాకు వ‌ర్కింగ్ టైటిల్ గా ఎస్ కే 20 అని పెట్టారు. కాగ త‌మిళ హీరో శివ కార్తికేయ‌న్ ప‌లు త‌మిళ సినిమాలు తెలుగులో రీమేక్ కావడంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర అయ్యారు. అలాగే ఇటీవ‌ల విడుద‌ల అయిన డాక్ట‌ర్ అనే సినిమా సైతం తెలుగు ప్రేక్ష‌కులను అల‌రించింది. ఈ డాక్ట‌ర్ సినిమాకు తెలుగు విడుద‌ల కావ‌డానికి హీరో శివ కార్తికేయ‌న్ ప్రమేష‌న్స్ భారీగానే చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news