ఇండియా మరియు అస్ర్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టీ20 లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఇరగ్గొట్టింది అని చెప్పాలి. ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్ లలో నాలుగు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మొదటగా స్లో గా ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత జాస్ ఇంగ్లీష్ రాకతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఇండియా బౌలర్లను రప్పాడించారు. అక్షర్ పటేల్ మరియు ముఖేష్ కుమార్ మినహా మిగిలిన ముగ్గురు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్ లలో ఇంగ్లిష్ (110) సెంచరీ చేయగా, స్మిత్ (52) అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇండియా ముందున్న 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత కష్టమేమీ కాదు. ఇండియా లో గైక్వాడ్, జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్య మరియు తిలక్ లు రాణిస్తే ఇదేమీ కష్టం కాదు.
మరి ఆస్ట్రేలియా బౌలర్లను తట్టుకుని ఆడితే గెలుపు అవకాశాలు మనకే ఎక్కువ. మరి సూర్యకు చాలా పెద్ద బాధ్యత ఉందని చెప్పాలి. కెప్టెన్ గా తొలి మ్యాచ్ గెలుస్తాడా లేదా అన్నది తెలియాలంటే మరికాసేపు ఆగాల్సిందే.