సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బర్రెలక్క మేనిఫెస్టో…!

-

తెలంగాణ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వం మీద ఆగ్రహంతో చదువులు చదివినా ఉద్యోగాలు రాలేదన్న కోపంతో ఒక డిగ్రీ చదివిన విద్యార్థిని ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకుని అందరికి షాక్ అయ్యేలా చేసింది. మరో వారంలో తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల్లో కొల్హాపూర్ నియోజకవర్గం నుండి స్వాతంత్ర్య అభ్యర్థినిగా శిరీష అలియాస్ బర్రెలక్క ఎమ్మెల్యే గా పోటీ చేయనుంది. ఇక ఇందులో భాగంగా ఎన్నికల్లో గెలవడానికి అందరిలాగే తన మ్యానిఫెస్టోను రెడీ చేసుకుంది.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ మానిఫెస్టోలో ఏముందని చూస్తే… నిరుద్యోగుల కోసం ప్రత్యేక కోర్స్ మరియు ఫ్రీగా శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ లో నిరుద్యోగం పై ప్రశ్నింస్తానంది, ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు అందవలసిన హక్కుల కోసం పోరాటం.

ప్రతి గ్రామంలోనూ ఇండ్లు రోడ్ల నిర్మాణం కోసం కృషి మరియు ఉచిత విద్య, వైద్యం కోసం ప్రయత్నాలు చేస్తానని మానిఫెస్టోలో పేర్కొని సామాన్యుల లీడర్ గా బర్రెలక్క సంచలనం సృష్టించేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news