ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీని వరుణుడు చివరి వరకు వదిలి పెట్టేలా లేడు. ఇప్పటికే నాలుగు మ్యాచులు వర్షార్పణం కాగా.. ఇవాళ జరగాల్సిన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారింది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీని వరుణుడు చివరి వరకు వదిలి పెట్టేలా లేడు. ఇప్పటికే నాలుగు మ్యాచులు వర్షార్పణం కాగా.. ఇవాళ జరగాల్సిన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారింది. దీంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చివర్లో వర్షం కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆ తరువాత ఇక ఏ దశలోనూ వర్షం ఆగలేదు. చివరి వరకు పడుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ రోజు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని భావించిన అంపైర్లు ఆటను రేపటికి వాయిదా వేశారు.
ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఎప్పటికప్పడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్‌లు చెరో 67 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇక భారత బౌలర్లు అందరికీ తలా 1 వికెట్ దక్కింది. కాగా న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 211 పరుగులు చేసే సరికి వర్షం పడింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.
కాగా ఇవాళ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణ కుదరలేదు. దీంతో అంపైర్లు ఆటను రేపు కొనసాగించాలని ప్రకటించారు. ఈ క్రమంలో ఇవాళ న్యూజిలాండ్ ఆటను ఆపిన దగ్గర్నుంచే రేపు మళ్లీ ఆట ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కివీస్ రేపు తమ ఇన్నింగ్స్‌లో మిగిలి ఉన్న మరో 3.5 ఓవర్లు ఆడుతుంది. ఆ తరువాత భారత్ తమ ఇన్నింగ్స్ ఆడుతుంది. అయితే రేపు కూడా వర్షం పడవచ్చని వాతావరణ శాఖ చెబుతున్న క్రమంలో ఒక వేళ రేపంతా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. ఇక ఐసీసీ నియమావళి ప్రకారం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియానే నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది..!