తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)గా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే నియమితులయ్యే అవకాశం ఉన్నది. తొలి సీడీఎస్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం హెలిక్యాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. రావత్ మృతితో నెక్స్ట్ ఆయన స్థానంలో ఎవరు నియమితులవుతారన్న విషయం ఆసక్తికరంగా మారింది. సీనియర్ దృష్ట్యా ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే నియామకమ్యే అవకాశాలు ఉన్నాయి.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కొత్తగా సృష్టించిన పదవి. తొలి సీడీఎస్ బిపిన్ రావత్. ఆయన ఆకస్మిక మరణంతో తదుపరి సీడీఎస్‌పై చర్చ ప్రారంభమైంది. ఆర్మీ, నేవీ, వాయుసేన అధిపతుల్లో ఒకరిని సీనియారిటీ ప్రకారం నెక్స్ట్ సీడీఎస్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నది. ఆర్మీ చీఫ్‌గా జనరల్ నరవాణే 2019, డిసెంబర్ 31న నియమితులయ్యారు. కేవలం ఎనిమిది రోజుల క్రితం నేవి అధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్, సెప్టెంబర్ 30న వాయుసేన అధిపతి చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీనియారిటీ దృష్ట్యా నెక్స్ట్ సీడీఎస్‌గా మనోజ్ ముకుంద్ నరవాణే ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.