కరోనా వచ్చిన తరువాత కూడా అతి పెద్దదైన దేశం భరత్ ఆర్థిక వ్యవస్థ నుండి కోలుకుందంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ మొదలెట్టిన ఆత్మనిర్భర భారతే కారణమని IMF (International Monetary Fund – అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) మోడీని ఆకాశానికెత్తేసింది. అతను తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) కార్యక్రమాన్ని చాలా ముఖ్యమైనదిగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ గుర్తించడం విశేషం.
స్వావలంబన భారత్ కార్యక్రమం కింద కేంద్రం ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీ భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఉపయోగ పడింది. అందువలననే ఈ కార్య్రమాన్ని చాలా ఉన్నతమైనదిగా చూస్తున్నాము అని IMF పేర్కొంది. అంతేకాకుండా అంతర్జాతీయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్ మరింతంగా ముందుకు వెళ్లే దిశగా అడుగులు వేసే విధి విధానాలపై దృష్టి పెట్టాలి అని IMF డైరెక్టర్ గెర్రీరైస్ వాషింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో భరత్ కు సూచించారు.