కరోనా వ్యాక్సి నేషన్ లో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆగస్టు లో దేశం లో 18 కోట్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గత నెలలో జీ 7 దేశాల్లో వేసిన మొత్తం వ్యాక్సిన్ల కంటే భారత్ లో ఎక్కువ కరోనా వ్యాక్సిన్లు వేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇక అటు అత్యల్పంగా కెనడా దేశం కేవలం 30 లక్షల మందికి, అత్యధికంగా జపాన్ 4 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.
కాగా.. కెనడా, బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ మరియు జపాన్ దేశాలను జీ 7 దేశాలుగా పిలుస్తారు. కాగా.. మన దేశం లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో గడచిన 24 గంటల్లో కొత్తగా… 42, 766 కరోనా కేసులు నమోదయ్యాయి.ప్రస్తుతం మన దేశంలో 4,10,048 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.42 శాతంగా నమోదైంది. అలాగే దేశంలో ఇప్పటివరకు 66.89 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది.