రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్, బంగారం, ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న ఇండియా వంటి దేశాలపై ఈ యుద్ధ ప్రభావం పరోక్షంగా పడింది. యుద్ధం వల్ల ఇండియాలో పెట్రోల్ , డిజిల్ ధరలతో పాటు వంట నూనెల ధరలు దారుణంగా పెరిగాయి. యుద్ధ పరిణామాలు వంటింట్లో మంటలు రాజేస్తున్నాయి. సన్ ఫ్లవర్, పామాయిల్ ధరలు పెరిగాయి. మనదేశానికి ముఖ్యంగా 80 శాతం సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఉక్రెయిన్, రష్యా దేశాలే ఎగుమతి చేస్తున్నాయి. యుద్ధం వల్ల ఈ రెండు దేశాల నుంచి ఇండియాకు దిగుమతులు నిలిచిపోయాయి.
ఇదిలా ఉంటే దేశంలో పెరుగుతున్న వంట నూనెల ధరలను తగ్గించేందుకు ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి సన్ ఫ్లవర్ క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. రష్యాకు రికార్డ్ ధర చెల్లించి మరీ ఈ ఆయిల్ ను దిగుమతి చేసుకోనుంది ఇండియా. 45 వేల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకోనుంది. టన్నుకు రికార్డ్ స్థాయిలో 2,150 డాలర్లను చెల్లిస్తోంది ఇండియా.