న్యూజిలాండ్‌తో సెమీస్ ఆడ‌కున్నా.. భార‌త్ ఫైనల్‌కు చేరుతుంది.. ఎలాగో తెలుసా..?

-

రేపు మాంచెస్ట‌ర్‌లో జ‌రిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌, భార‌త్‌లు త‌ల‌ప‌డ‌నున్న విష‌యం విదిత‌మే. అయితే ఈ మ్యాచ్‌లో వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు బ్రిట‌న్ వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 సెమీ ఫైన‌ల్ మ్యాచుల కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రేపు మాంచెస్ట‌ర్‌లో భార‌త్‌, న్యూజిలాండ్‌ల మ‌ధ్య తొలి సెమీస్ జ‌ర‌గ‌నుంది. ఇక ఈ నెల 11వ తేదీన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మ‌ధ్య బ‌ర్మింగ్‌హామ్‌లో రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌ల‌లో గెలిచిన రెండు జ‌ట్లు ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఓ కొత్త అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. అస‌లు టీమిండియా.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడ‌క‌పోతే.. ఫైన‌ల్ కు చేరుకుంటుంది క‌దా.. అని.. మ‌రి అదెలా సాధ్య‌మో తెలుసా..?

రేపు మాంచెస్ట‌ర్‌లో జ‌రిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌, భార‌త్‌లు త‌ల‌ప‌డ‌నున్న విష‌యం విదిత‌మే. అయితే ఈ మ్యాచ్‌లో వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు బ్రిట‌న్ వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. దీంతో రేపు మ్యాచ్ ఒక వేళ వ‌ర్షం వ‌ల్ల ఆగిపోతే.. మ‌రుస‌టి రోజు అంటే ఎల్లుండి తిరిగి మ్యాచ్‌లు అక్క‌డినుంచే కొన‌సాగిస్తారు. సెమీ ఫైన‌ల్ క‌నుక రిజ‌ర్వ్ డేల‌ను ముందుగానే నిర్ణ‌యించారు. అందువ‌ల్ల వ‌ర్షం కార‌ణంగా రేపు మ్యాచ్ నిర్వ‌హించే ప‌రిస్థితి లేక‌పోతే ఎల్లుండి మ్యాచ్ ఉంటుంది.

అయితే నిజానికి రేపే మాంచెస్ట‌ర్‌లో వాతావ‌ర‌ణం బాగుంటుంద‌ట‌. బుధ‌వారం వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని వాతావ‌రణ శాఖ చెబుతోంది. ఈ క్ర‌మంలో రేపు, ఎల్లుండి వ‌ర్షాల వ‌ల్ల ఇండియా, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ ఆగిపోతే.. మ్యాచ్‌ను నిర్వ‌హించేందుకు మ‌రో రిజ‌ర్వ్ డే లేదు క‌నుక మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తారు. అయితే అదే జ‌రిగితే ఐసీసీ నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. లీగ్ ద‌శ‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో ఎక్కువ పాయింట్లు ఉన్న జ‌ట్టు ఫైన‌ల్‌కు అర్హ‌త సాధిస్తుంది. అంటే.. ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం టీమిండియాకు 15 పాయింట్లు, న్యూజిలాండ్‌కు 11 పాయింట్లు ఉన్నాయి క‌నుక‌.. ఆటోమేటిగ్గా ఇండియానే ఫైన‌ల్‌కు వెళ్తుంది. ఈ క్ర‌మంలోనే ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య సెమీస్ మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల ఆగిపోయినా ఇండియానే ఫైన‌ల్ కు వెళ్లే అవ‌కాశం ఉండ‌డంతో వ‌ర్షం వ‌చ్చినా.. ఏమీ కాదులే అని టీమిండియా అభిమానులు చింత లేకుండా ఉన్నారు. మరి రేప‌టి మ్యాచ్‌పై వ‌ర్షం ప్ర‌భావం ఎలా ఉంటుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news