మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
గ్రూప్ సీ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 5 గ్రూప్ సీ సివిలియన్ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. అయితే దీనిలో మొత్తం 5 ఉద్యోగ ఖాళీలలో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఏఎఫ్ స్టేషన్ బీదర్‌లో రెండు జాబ్స్ ఉండగా కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్‌లో మూడు జాబ్స్ ఉన్నాయి.
జనవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. అభ్యర్థులకు 2022 సంవత్సరం జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆన్ లైన్ అబ్జెక్టివ్ పరీక్ష జరుగుతుంది మొత్తం 641 పోస్టులలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 286 సీట్లు ఉన్నాయి.
ఓబీసీ కేటగిరీలో 133 సీట్లు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 61 సీట్లు, ఎస్సీ కేటగిరీలో 93 సీట్లు, ఎస్టీ కేటగిరీలో 68 సీట్లు ఉన్నాయి. ఇక వయస్సు విషయానికి వస్తే.. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అప్లై చేసుకోచ్చు. దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉంది.