కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు షురూ… లీడింగ్ లో త్రుణమూల్…

-

దేశ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న ఎన్నికల్లో కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ఒకటి. ముఖ్యంగా అధికారి త్రుణమూల్ కాంగ్రెస్.. ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఎన్నికల పోలింగ్ సమయంలో ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. రెండు పోలింగ్ స్టేషన్ల వద్ద బాంబులతో ఇరు పార్టీల కార్యకర్తలు దాడులకు దిగారు. దీంతో ఈ రిజల్ట్స్ ఎలా వస్తాయో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

తాజాగా కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్(కేఎంసీ) ఓట్ల లెక్కింపు షురు అయింది. పశ్చిమ బెంగాల్ కేఎంసీ  144 వార్డులకు డిసెంబర్ 19 (ఆదివారం) కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ నిర్వహించారు. దాదాపు 40.5 లక్షల మంది ఓటర్లలో 63 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం త్రుణమూల్ 6 వార్డుల్లో లీడింగ్ లో ఉందని తెలుస్తోంది. మరో వైపు బీజేపీ, వామపక్షాలతో పాటు కాంగ్రెస్ కేఎంసీ బరిలో నిలుచున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీకి గట్టిపోటీ ఇచ్చి ప్రతిపక్ష హోదా కైవసం చేసుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఎంతమేర ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news