ఫార్చ్యూ-500 జాబితా విడుదల.. సత్తా చాటిన భారతీయ సంస్థలు!

-

ఫార్చ్యూ-500 కంపెనీల జాబితాలో భారతీయ కంపెనీలు సత్తా చాటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) జాబితాలో భారత్ నుంచి అగ్రగామి సంస్థగా చోటు సంపాదించుకుంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 51 స్థానానికి ఎగబాకింది. గతేడాది 155వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఈ ఏడాది 104వ ర్యాంకుకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ రంగ, ప్రైవేట్ కంపెనీల ర్యాంకులను ఫార్చ్యూన్ సంస్థ ఇటీవల రూపొందించింది. భారత్ నుంచి టాప్-500లో మొత్తం 9 సంస్థలకు స్థానం దొరికింది. ఇందులో 5 ప్రభుత్వం రంగ సంస్థలు, 4 ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి.

ఫార్చ్యూ-500 జాబితా
ఫార్చ్యూ-500 జాబితా

ఎల్ఐసీ 98వ ర్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు 104వ స్థానం దక్కింది. ప్రైవేట్ రంగం తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రగామిగా నిలిచింది. ఫార్చ్యూన్-500 జాబితాలో వరుసగా 19వ సారి రిలయన్స్ చోటు దక్కించుకోవడం గమనార్హం. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 142వ ర్యాంకు, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ 190వ ర్యాంకు, టాటా గ్రూప్ 370వ ర్యాంకు, టాటా స్టీల్ 435 ర్యాంకు,  రాజేష్ ఎక్స్‌ పోర్ట్స్ 437వ ర్యాంకు, ఎస్‌బీఐ 236వ ర్యాంకు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 295వ ర్యాంకును నమోదు చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news