Good News : ఇండిగో ఆఫర్‌.. 1616కే టికెట్‌

-

ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో శుభవార్త చెప్పింది. చవక ధరల విమానయాన సంస్థ ఇండిగో ‘స్వీట్ 16’ పేరుతో బ్రహ్మాండమైన ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థను ప్రారంభించి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది ఇండిగో. ఇందులో భాగంగా అన్ని పన్నులతో కలిపి రూ. 1616 ప్రారంభ ధరతో టికెట్‌ను అందిస్తోంది. మంగళవారం ప్రారంభమైన ఈ ఆఫర్ కింద నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో విమాన ప్రయాణం చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.

IndiGo Cadet Pilot Program - L3Harris Flight Academy

ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసిన టికెట్లపై ఈ నెల 18 నుంచి వచ్చే ఏడాది జులై 16 మధ్య ఎప్పుడైనా ప్రయాణించొచ్చని ఇండిగో పేర్కొంది. ఈ ఆఫర్‌ గురించి ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకునే అవకాశాన్ని ఈ ఆఫర్ కల్పిస్తోందన్నారు. అయితే, ఈ ఆఫర్‌లో భాగంగా ఎన్ని టికెట్లను విక్రయించేది వెల్లడించలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news