సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ఐపీఎల్ 13వ ఎడిషన్ జరగనున్న విషయం విదితమే. అందుకు గాను తాజాగా బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా పొందింది. యూఏఈ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐకి ఐపీఎల్‌ను నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌ను రూపొందించే పనిలో పడింది. అయితే ఈసారి టోర్నీకి టైటిల్ స్పాన్సర్‌షిప్‌గా వివో కంపెనీని కొనసాగించడంపై బీసీసీఐపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చైనా కంపెనీకి సదరు స్పాన్సర్‌షిప్ హక్కులను ఎలా కంటిన్యూ చేస్తారని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఓ వైపు భారత్ 59 చైనా యాప్‌ను బ్యాన్ చేసింది. చైనా ఆర్మీ భారత సైనికులను చంపుతున్నారు. దీంతో భారత్ చైనాపై అమీ తుమీకి తేల్చుకునేందుకు సిద్ధమైంది. భారత్‌లోని చైనా కంపెనీలకు చెక్ పెడుతున్నారు. అలాంటిది బీసీసీఐ చైనా కంపెనీ వివోకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను ఎలా కొనసాగిస్తుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల అది ఐపీఎల్ కాదని.. చైనా కంపెనీ స్పాన్సర్ చేస్తున్న చైనీస్ ప్రీమియర్ లీగ్ అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో నెటిజన్లు #ChinesePremierLeague అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేస్తున్నారు. బీసీసీఐ వెంటనే వివోకు స్పాన్సర్‌షిప్ హక్కులను నిలిపివేయాలని, లేదా టోర్నీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. చైనాతో నెలకొన్న వివాదాలను తాము అర్థం చేసుకున్నామని, భారతీయుల సెంటిమెంట్లను గౌరవిస్తున్నామని తెలిపారు. అయితే చైనా కంపెనీ ఐపీఎల్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నా.. అది భారత్‌కే మేలు చేస్తుందని, టోర్నీ నిర్వహణ ద్వారా తాము 42 శాతం ట్యాక్స్‌ను భారత ప్రభుత్వానికి చెల్లించాలని, అందువల్ల అది చైనాకు మేలు కాదని, భారత్‌కే మేలు చేసినట్లవుతుందని, అందువల్లే వివోను ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే చైనాతో నెలకొన్న వివాదాల నేపథ్యంలో బీసీసీఐ గతంలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యాఖ్యానించడం విశేషం. తాము భారత క్రికెట్ అభిమానుల సెంటిమెంట్లను గౌరవిస్తామని, అవసరం అయితే చైనా కంపెనీలతో ఉన్న డీల్స్‌పై పునరాలోచించి నిర్ణయం తీసుకుంటామని గతంలో బీసీసీఐ తెలిపింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుండడంతో నెటిజన్లు బీసీసీఐ మీద ఫైరవుతున్నారు. మరి ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.