ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కి ఎందుకని పెట్టడానికి శాస్త్రవేత్తలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం కరోనా వైరస్ నివారణ తప్ప ముందు లేకపోవడంతో అగ్రరాజ్యం లాంటి అమెరికా కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ డాక్టర్ ‘ ఇదిగో కరోనా వ్యాక్సీన్ ‘ అంటూ ముందుకు వస్తున్నారు. బెంగళూరు నగరానికి చెందిన డాక్టర్ విశాల్ రావు మీ భయంకరమైన కరోనా వైరస్ కి మందు కనుగొన్నట్లు చెప్పుకొస్తూ అది ఫస్ట్ స్టేజి లో ఉందని తెలిపారు.ఈ క్రమంలో తయారుచేసిన మందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు దాఖలు చేశారు. బెంగళూరుకు చెందిన విశాల్ రావు ప్రస్తుతం అంకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. భూమి మీద ఉన్న మనిషి జాతిని ప్రమాదకరం లోకి నెట్టేసిన ఈ వైరస్ ని అంతమొందించే వ్యాక్సిన్ కనుగొన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ వైరస్ విస్తరించిన రోగుల్లో సైటోకిన్ ను ఇంజెక్ట్ చేస్తామని ఇది వైరస్ నిర్మూలన ప్రారంభ దశ అని.. వారంలోగా తుది దశకు చేరుకుంటామని వివరించారు. దీంతో చాలా వరకు వార్త విని ఊపిరి పిలుచుకొని..విశాల్ రావు చేసిన ప్రయత్నం సఫలం కావాలని భగవంతుడికి మొక్కుతున్నారు.
ప్రపంచంలో అగ్రరాజ్యాలు అని చెప్పుకుంటున్న అన్ని దేశాలు కరోనా వైరస్ ముందు కామెడీ పీస్ అయిపోయాయి. ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ ని భారతీయులు గట్టిగా ఎదుర్కొనడం తో, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా…భారతదేశం పేరు మారుమ్రోగుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా భారతీయులలో మంచి ఐకమత్యం ఉందని ఎన్ని కులాలు, ఎన్ని మతాలు ఉన్న వాళ్లంతా ఒకటే అన్నట్టుగా కరోనా వైరస్ తో చేసే యుద్ధంలో మంచి విజయం సాధించాలని డబ్ల్యు.హెచ్.ఓ అధికారులు కోరుకున్నారు. ఇదే టైమ్ లో విశాల్ రావు కి మరి కొంతమంది డాక్టర్లు సహాయం చేయడానికి కూడా ముందుకు రావటం విశేషం.