వాట్సప్ హ్యాకింగ్: వాట్సప్ పై కేంద్రం గుస్సా..

-

వాట్సప్ హ్యాకింగ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదో హాట్ టాపిక్. ఇండియన్స్ బాగా జోరుగా వాడే వాట్సప్ ను ఇజ్రాయెల్ స్పైవేర్ పీగాసుస్ హ్యాకింగ్ చేసిందన్న వాస్తవం కలకలం సృష్టించింది. ఇండియన్ల వాట్సప్ డేటా ఆ సంస్థ దొంగిలించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

ప్రపంచవ్యాప్తంగా 150కోట్ల మంది వాట్సాప్ వాడుతంటే.. అందులో కేవలం భారతీయులే 40కోట్ల మంది ఉన్నారు. అంటే వాట్సప్ వినియోగదారుల్లో దాదాపు 30 శాతం మంది ఇండియన్లే అన్నమాట. అందుకే ఈ హ్యాకింగ్ ఈ వ్యవహారంపై ఈనెల నాలుగులోగా పూర్తి నివేదిక సమర్పించాలని కేంద్రం వాట్సాప్ కు అల్టిమేటమ్ ఇచ్చింది.

లక్షలాది మంది భారత వాట్సాప్ ఖాతాదారుల వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు తీసుకున్న రక్షణ చర్యలు ఏంటో చెప్పాలని నిలదీసింది. వాట్సాప్ ద్వారా వదంతుల వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సి చర్యలపై జూన్ నుంచి జరుగుతున్న చర్చల్లో ఈ హ్యాకింగ్ గురించి చెప్పకపోవటంపై కేంద్రం సీరియస్ గా ఉంది. ఇలాంటి ఘటనలను గుర్తించి, జవాబుదారితనం చేయటానికి ప్రభుత్వం తీసుకునే చర్యలను ఇది వాట్సప్ అడ్డుకోవటమేనని కేంద్రం అభిప్రాయపడింది.

ఇప్పటికే దేశంలో సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి 3నెలలగడువు కోరింది. ఈ నేపథ్యంలో హ్యాకింగ్ జరిగిన సమయం చెప్పాలని వాట్సప్ ను కోరింది. మరోవైపు వాట్సప్ డాటా హ్యాకింగ్ పై వినియోగదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. తమ సమాచారం ఏ ఫిషింగ్ వెబ్ సైట్లు, టెర్రరిస్టుల చేతుల్లో పడితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి :  వాట్సప్‌ హ్యకింగ్‌ అంటే..? పెగాస‌స్ స్పై వేర్‌.. ఏమిటిది..? ఏం చేస్తుంది..?

Read more RELATED
Recommended to you

Latest news