ఫిట్‌బిట్ కంపెనీని 2.1 బిలియన్ డాలర్లకు (దాదాపుగా రూ.14,845 కోట్లు) కొనుగోలు చేసినట్లు గూగుల్ తాజాగా వెల్లడించింది. దీంతో గూగుల్ స్మార్ట్‌వాచ్ రంగంలో ఆపిల్‌కు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ బ్రాండెడ్ పిక్సల్ సిరీస్ ఫోన్లతో ఆపిల్ ఐఫోన్లకు పోటీనిస్తున్న విషయం విదితమే. అయితే ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌ల విషయానికి వస్తే ఆపిల్ ఒక మెట్టు పైనే ఉంది. మార్కెట్‌లో ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇకపై ఆ రంగంలోనూ గూగుల్ ఆపిల్‌తో పోటీ పడనుంది. ఎందుకంటే.. అమెరికాకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ పరికరాల తయారీదారు ఫిట్‌బిట్ కంపెనీని గూగుల్ కొనుగోలు చేసింది. దీంతో గూగుల్ స్మార్ట్‌వాచ్ రంగంలో ఆపిల్‌కు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫిట్‌బిట్ కంపెనీని 2.1 బిలియన్ డాలర్లకు (దాదాపుగా రూ.14,845 కోట్లు) కొనుగోలు చేసినట్లు గూగుల్ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ డివైసెస్ అండ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ రిచ్ ఓస్టర్‌లోహ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిట్‌బిట్ కంపెనీ కొనుగోలు ద్వారా వియర్ఓఎస్ సహాయంతో స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్ల రంగంలో ఇతర కంపెనీలతో పోటీ పడనున్నామని రిచ్ ఓస్టర్‌లోహ్ వెల్లడించారు.
అయితే మార్కెట్‌లో ఇప్పటికే ఆపిల్‌కు ప్రత్యామ్నాయంగా శాంసంగ్, హువావే, షియోమీ వంటి కంపెనీలు తక్కువ ధరలకే ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్‌వాచ్‌లను అందిస్తున్నాయి. మరి గూగుల్ ఈ విషయంలో ఎలా ముందుకు సాగుతుందో చూడాలి..!