భారత్ సత్తా చాటిన ఎన్నారై బాలిక..!!!

-

ప్రతిభ ఎవరి సొంతం కాదు, డానికి చిన్నా, పెద్దా తేడా ఉండదు.  చిన్న వారిలో ప్రతిభని గుర్తుంచి మనం వారిని ఎంత ప్రోత్సహిస్తే, అంతకు మించి అద్భుతాలు సృష్టిస్తారు పిల్లలు. అలంటి ప్రోత్సాహానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో ప్రతిభను చూపే చిన్నారులకు ప్రతీ ఏడాది అందించే అవార్డ్ “గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్”. ఈ అవార్డులను స్పాన్సర్ చేస్తున్నది, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారితో పాటుగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ లు. అయితే ఈ అవార్డ్ ను సింగింగ్ విభాగం లో భారత సంతతి బాలిక గెలుచుకుంది.

దుబాయ్ లో నివసిస్తున్న 13 సంవత్సరాల ప్రవాస బాలిక సుచేత సతీష్ ఈ అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఆమె ఒకే కచేరిలో 120 బాషలలో అనర్గళంగా పాటలు పాడగలదు. అంతటి ప్రతిభ ప్రదర్శనను స్టేజి పై చూసి మెచ్చిన కమిటీ ఈ బాలికను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మాట్లాడిన సుచేత, తాను ఈ అవార్డ్ గెలుచుకోవటం చాల సంతోషంగా ఉందని చెప్పింది. ఇంకా తను సాధించిన ఇంకో ప్రంపంచ రికార్డు ను కూడా గుర్తుచేసుకుంది.

 

120 భాషలలో కచేరీ చేయగల తను, రెండేళ్ళ క్రితమే అంటే 12 ఏళ్ళ వయసులో దుబాయి లో ఇండియన్ కాన్సులేట్  ఆడిటోరియం లో జరిగిన కచేరీ లో 102 భాషలలో ఏకధాటిగా 6.15 గంటల పాటు గానం చేసి అందరిని అలరించి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన సుచేత ఈ అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news